ఆప్ట్ చైల్డ్ హోమ్ ను సందర్శించిన నాటా సంస్ధఆప్ట్ చైల్డ్ హోమ్ ను సందర్శించిన నాటా సంస్ధ 
ఆశ్రమ నిర్వహణకు రూ.2 లక్షల విరాళం 
ఆశ్రమ నిర్వహణపై అభినందనలు తెలిపిన నాటా 
 
సత్తెనపల్లి: అనాధ పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆప్ట్ చైల్డ్ హోమ్ వ్యవస్ధాపకులు గాత్రం వెంకాయమ్మ,రాఘవలు  చేస్తున్న సేవ ఎంతో అభినందనీయమని, ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని నాటా (నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) సంస్ధ బాద్యులు గోశాల  రాఘవరెడ్డి కొనియాడారు.
 
 
మంగళవారం రాత్రి పట్టణంలోని సుందరయ్య నగర్ లోని  ఆప్ట్  ఆశ్రమాన్ని సందర్శించారు.ఆశ్రమం నిర్వహణలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువులకు,సంక్షేమానికి,ఆశ్రమ నిర్వహణకు రూ.2 లక్షల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఎప్పుడూ అవసరం వచ్చిన ఆశ్రమానికి అండగా ఉంటామన్నారు. ప్రతి సంవత్సరం ఆశ్రమాన్ని సందర్శిస్తామన్నారు.
 
 
అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు.నృత్య ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకున్నారు.కార్యక్రమంలో నాటా సంస్ధ బాద్యులు కారసపాటి శ్రీధర్, శ్రీనివాసరెడ్డి,ఆళ్ళ రామిరెడ్డి, గండ్ర నారాయణరెడ్డిలతో పాటు ఆశ్రమ సిబ్బంది ఉన్నారు.