మానవాళికి ప్రాణం పోసేది మొక్కలే:ఎమ్మెల్యే అంబటి



మానవాళికి ప్రాణం పోసేది మొక్కలే:ఎమ్మెల్యే అంబటి
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:డిఎస్పీ
 
సత్తెనపల్లి,జనవారధి:మానవాళికి ప్రాణం పోసేది మొక్కలేనని, వాటిని పెంచి పెద్దచేస్తే అవి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయని ఎమెల్యే అంబటి రాంబాబు అన్నారు.శనివారం పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో స్ధానిక హోలీ ఫ్యామిలీ పాఠశాలలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమెల్యే అంబటి రాంబాబు,డిఎస్పీ ఆర్. విజయ భాస్కర రెడ్డిలు  ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భాగస్వాములై నాటిన మొక్కలను సంరక్షించాలని పేర్కొన్నారు.డిఎస్పీ విజయ భాస్కర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పట్టణ సిఐ విజయ చంద్ర,ఎస్సైలు క్రాంతి కుమార్,శివాంజనేయలు,పోలీస్ సిబ్బంది,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,విద్యార్ధులు తదితరులున్నారు.