ఏపిలో అభివృద్ధి కుంటుపడింది: మాజీ సభాపతి కోడెల‌సత్తెనపల్లి,జనవారధి:నూతనంగా కొలువుతీరిన ప్రభుత్వ విధానలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని,ప్రత్యేక హోదా ఉద్యమం మసకబారిందని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు.సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాజధాని, పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనేది అవాస్తవమన్నారు.ఆరోపణలు చేసే వారు ఆధారలతో మాట్లాడాలన్నారు. ప్రత్యేక హోదా సాధకు కట్టుబడి ఉన్నామన్నవారే ఇప్పుడు దానిపై  మాట్లాడం లేదని విమర్శించారు.
 
ఇసుక విధానం పై ప్రభుత్వనికి స్పష్టతలేదని, రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.ఈ సమావేశంలో ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి,రాజుపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూజల వెంకట కోటయ్యలున్నారు.