పాత విధానంలోనే ఇసుక స‌ర‌ఫ‌రా చేయాలిపాత విధానంలోనే ఇసుక స‌ర‌ఫ‌రా చేయాలి
అన్ని ర్యాంపుల‌ను అందుబాటులో ఉంచాలి 
ర్యాలీ నిర్వ‌హించిన భ‌వ‌న నిర్మాణ కార్మిక సంఘాలు
 
స‌త్తెన‌ప‌ల్లి,జనవారధి:  రాష్ర్ట ప్ర‌భుత్వం పాత విధానంలోనే ఇసుకను స‌ర‌ఫ‌రా చేయాల‌ని, అన్ని ర్యాంపుల‌ను అందుబాటులో ఉంచాల‌ని భ‌వ‌న నిర్మాణ కార్మ‌క సంఘాలు రోడ్డెక్కాయి.సోమ‌వారం జ‌రిగిన ఈ కార్యక్ర‌మంలో ఆయా సంఘాల నాయ‌కులు మాట్లాడుతూ గ‌త 6 నెల‌లుగా ఇసుక స‌ర‌ఫ‌రా లేక భ‌వ‌న నిర్మాణ అనుబంధ రంగాల‌లో పూర్తి స్థాయిలో ప‌నులు నిలిచిపోయాయ‌ని, వేల సంఖ్య‌లో కూలీల‌కు, వందల సంఖ్య‌లో మేస్ర్తీల‌కు, య‌జ‌మానుల‌కు ప‌నులు లేకుండా పోయాయిని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇసుకను సత్వరమే అందుబాటులో ఉంచాలని  భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి ప్రసాద్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ ఆంజనేయులు డిమాండ్ చేశారు.
 
గత రెండు నెలలుగా పనుల్లేకపొవటంలో కుటుబాల పరిస్ధితి దయనీయంగా మారిందని జీవన భృతి కింద నెలకు రూ.10వేలు మంజూరి చేయాలని వారు కోరారు.గుంటూరు జిల్లాలో అనేక‌ ఇసుక రీచ్ లు ఉండగా వాటికి అనుమతులు ఇవ్వకుండా ఇతర జిల్లాల నుండి ఇసుకను తెచ్చుకోవడం తలకు మించిన భారంగా మారిందన్నారు. నిర్మాణాలను చేపట్టి న యజమానులు ఈ భారాన్ని మోయలేక పనులు నిలిపి వేశారు. ఒక భవనాన్ని నిర్మించాలంటే 32 రకాల కార్మికులు పనిచేయాలని ఇసుక కొరత వల్ల ఈ కార్మికుల అందరూ ఉపాధి కోల్పోయారని వెల్లడించారు.
 
అనంతరం కార్మికులతోపాటు నాయకులు తాహశీల్దార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ స్పందిస్తూ.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి మామిడి వెంకటేశ్వరరావు, చేనేత సంఘం జిల్లా కార్యదర్శి వీరబ్రహ్మం, చేనేత సొసైటీ ప్రెసిడెంట్ కట్ట శివ దుర్గారావు, పెయింటర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గరికిపాటి విజయబాబు,  సైదులు, పాపి శెట్టి బాలచంద్ర రావు, ఏ సౌరిలు, సాల్మన్ రాజు, సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్.కె  మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.