కనకదుర్గమ్మకు సారె బహుకరణ‌సత్తెనపల్లి,జనవారధి: ఆషాడమాసం సందర్భంగా బెజవాడలో కొలువు తీరిన  కనకదుర్గమ్మకు సత్తెనపల్లి ఆర్యవైశ్య చలివేంద్ర, ఆర్యవైశ్య సంఘాల‌ ఆధ్వర్యంలో ఆషాడమాసం సారెను బహుకరించేందుకు శుక్రవారం తరలివెళ్ళారు. వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గ‌రనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఈసందర్భంగా ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం అద్యక్షులు కొత్తా లక్ష్మయ్య గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలె ఈ ఏడాది కూడా అమ్మవారికి సారెను బహుకరించటానికి వెళ్ళడం ఆనందంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో జవ్వాజి లక్ష్మి, తూనుగుంట్ల కన్యాకుమారి, కొత్తా విజయలక్ష్మి, వెలుగూరి శరత్ బాబు తొమ్మండ్రు సత్యనారాయణ,కొత్తా సత్యనారాయణ పెరుమాళ్ళ రాములు తదితరులు పాల్గొన్నారు.