గెలిచినా, ఓడినా ప్రజాసేవలోనే: బీసీ జనార్దన్‌రెడ్డిగెలిచినా, ఓడినా ఎప్పటికీ ప్రజాసేవలో ఉంటానని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో సొంత నిధులు రూ.8 లక్షలతో నిర్మించిన వాటర్‌ ప్లాంటును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలుగొట్ల గ్రామానికి మినరల్‌ వాటర్‌ ప్లాంటు అప్పుడు టీడీపీలో ఉన్న కలుగొట్ల రామేశ్వరరెడ్డికి చెందిన స్థలంలో ఏర్పాటు చేశామన్నారు. అయితే ఆయన పార్టీ మారి వైసీపీలోకి చేరారన్నారు. తన స్థలంలో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని తీసి వేశారన్నారు అప్పట్నుంచి ప్రజలు మినరల్‌ వాటర్‌ కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన షేక్‌ అబ్బా్‌సమియా మినరల్‌ వాటర్‌ ప్లాంటు నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చారన్నారు. స్థలంలో పేదల దాహార్తిని తీర్చడానికి మాజీ ఎమ్మెల్యే బీసీ రూ.1.50 లక్షలు సొంత నిధులు వెచ్చించి మినరల్‌వాటర్‌ ప్లాంటు పునఃప్రారంభించినట్లు తెలిపారు.