ఘనంగా ఎస్ వి రంగారావు జయంతి వేడుకలుసత్తెనపల్లి, జనవారధి : విశ్వవిఖ్యాత  నటుడు ఎస్ వి  రంగారవు 101 వ‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద ఉన్న ఎస్ వి ఆర్ విగ్రహానికి పలువురు నాయకులు, అభిమాన సంఘాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి మురళి మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ నటుడు  ఎస్ వి రంగారవు అన్నారు.  పౌరానిక, జానపద చిత్రాల్లో ఆయన నటన అసమాన్యమన్నారు. పాతాళభైరవి చిత్రంలో ఆయన నటన అధ్వితీయమన్నారు. ఆప్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఉత్తమ పురష్కారమందుకున్న తొలి నటుడన్నారు. ఆయనతో పాటు వైకాపా పట్టణ పార్టీ అధ్య‌క్షులు నాగుల్ మీరా, మాజీ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, అచ్యుత శివప్రసాద్ తదితరులున్నారు.