సిఐ విజయచంద్రను సన్మానించిన ఆర్యవైశ్య నాయకులుసత్తెనపల్లి, జనవారధి:  ఆర్యవైశ్య యువజనసంఘం  అద్యక్షులు  కొత్తా రామకృష్ణ ఆద్వర్యంలో సత్తెనపల్లి పట్టణ సిఐని మర్యాద పూర్వకంగా కలసి వారిని పూలమాల వేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సి.ఐ విజయచంద్ర మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య లు ఎక్కువగా వున్నాయని కొద్ది రోజులలోనే వాటిని పరిష్కరించటానికి కృషిచేస్తామని దానికి వ్యాపారస్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సంఘం  సభ్యులు యక్కల బుల్లిస్వామి, యక్కల సుబ్బారావు, వనమా రాజేష్, మట్టా శ్రీనివాస్, కాపుగంటి సుబ్బరావు, పెరుమాళ్ళ సుదాకర్ , రాఘవేంద్ర, చిలకల వాసు,  మెహర్ మహేష్, త్రిపురమల్లు వాసు, బచ్చు రాజేష్ తదితరులు పాల్గొన్నారు..