రేపటికి వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ...ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ముగియడంతో ప్రొటెం స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు‌. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశమైన శాసనసభలో ఒక్కరు మినహా 173 మంది సభ్యులు ప్రమాణస్వీకారం పూర్తయింది. నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సభకు హాజరు కాలేదు. స్పీకర్‌ ఎన్నిక రేపు జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తమ్మినేని సీతారాం అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు.