జగన్ ని కలిసిన జనసేన ఎమెల్యే ..



నేడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశం జరిగింది . ఈ సమావేశంలో అందరు ఎమెల్యేల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు .. అనంతరం అందరు ఎమెల్యేలు కలిసి మాట్లాడుకున్నారు .. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ ని జనసేన పార్టీ నుండి గెలిచిన రాజోలు ఎమెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్ ని కలిసి కాసేపు ముచ్చట్టించారు .. అననతరం బయటకు వచ్చిన అయన మీడియాతో మాట్లాడారు .. జగన్ ని కేవలం మర్యాదపూర్వకంగానే కలవడం జరిగిందని అయన అన్నారు .. జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే కావడంతో ఆయన అధికార పార్టీ వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ తాను జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు.