ఎమ్మెల్యే రోజాకు నామినేటెడ్‌ పోస్టునగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు నామినేటెడ్‌ పోస్టు ఖరారైంది. ఏపీఐఐసీ చైర్మన్‌గా నగరి ఎమ్మెల్యే రోజా పేరు ప్రభుత్వం ఖరారు చేసింది. తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియడం లేదని రోజా ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాను ఎవరిమీద అలగలేదని, ఏ పదవిని ఇచ్చినా స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే.. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఆమెను తాజాగా జగన్ ఈ పదవిలో నియమించడం విశేషం.