కోడెల కూతురిపై మరో ఫిర్యాదు...కోడెల కూతురిపై మరో ఫిర్యాదు వచ్చింది. భూకబ్జా చేశారంటూ నర్సరావుపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో జెల్లి విజయప్రసాద్‌ కంప్లైంట్‌ చేశాడు. కేసనపల్లి సర్వే నెంబర్‌ 145/B3 భూమి విషయంలో కోడెల కూతురు 15లక్షలు డిమాండ్ చేసిందని, పన్నెండున్నర లక్షలు చెల్లించినా, మరో రెండున్నర లక్షలు ఇవ్వాలంటూ తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితుడు జెల్లి విజయప్రసాద్‌ పోలీసులను ఆశ్రయించాడు.