పుదుచ్చేరి మాజీ సీఎం మృతిపుదుచ్చేరి మాజీ సీఎం, డీఎంకే నాయకుడు ఆర్వీ జానకిరామన్ (79) సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతిచెందినట్ల ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదుసార్లు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన జానకీరామన్‌ 1996-2000 మధ్య కాలంలో సీఎంగా వ్యవహరించారు. 1941 జనవరి 8న పుదుచ్చేరిలో జన్మించిన రామన్‌ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. జానకీరామన్ మృతికి పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు.