అందానికి చలానా రాసిన ట్రాఫిక్ పోలీస్...అమ్మాయిలను ఎలగైన ఆకర్షించడానికి అబ్బాయిలు తిరోక్కతీరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందుకోసం తమ వృత్తిని సైతం వాడుకుంటారు. కొంతమంది అయితే తాము పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నానని, లేని ఉద్యోగాన్ని, ఉన్నట్లుగా చూపిస్తారు. అయితే చట్టానికి లోబడి పనిచేస్తున్న ఓ అధికారి తన వృత్తిని ప్రేమ కోసం వాడుకుంటే? సరిగ్గా ఇదే జరిగింది. ఉరుగ్వేలోని పెసందే ప్రాంతంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిని ఆపి చలానా రాశాడు. అయితే చలానే కదా ఇందులో వింత ఏంఉందని అనుకుంటున్నారా? అయితే అసలు కథ పూర్తిగా చదవండి.
 
సాధరణంగా అయితే సీటు బెల్ట్ లేదనో, లైసెన్స్ లేదనో లేక హెల్మెట్ లేదనో పోలీసులు చలానా రాస్తుంటారు. కానీ బండి మీద వెళ్తున్న అమ్మాయిని ఆపి చలానా రాశాడు. ఎందుకంటే ఆ యువతి తెగ అందంగా ఉందని సదరు యువతికి చలానా రాశాడు. పబ్లిక్ రోడ్లపై అందగత్తె (ఎక్సెసివ్ బ్యూటీ ఆన్ పబ్లిక్ రోడ్స్) అంటూ చలానాలో పేర్కొన్నాడు. ఇంకేముంది ఆ యువతి చలానాని నేరుగా సోషల్ మీడియా పెట్టింది. ఇంకేముంది 24గంట్లోనే తెగ వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.