గురువాయుర్‌లో మోడీ తులాభారం...కేరళలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడి గురువాయుర్ లోని ప్రసిద్ద శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో మోడీ తులాభారం నిర్వహించారు. తన ఎత్తు కలువ పూలను స్వామి వారికి మోడీ సమర్పించారు. ప్రధాని మోడీ తిరుమల శ్రీవారి దర్శన నిమిత్తం ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు కన్నా లక్ష్మీనారాయణ.సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు.