జనసేన నుండి తప్పుకున్నరావెల కిషోర్ బాబు...జనసేన కి షాక్ తగిలిందనే చెప్పాలి .. జనసేనకి పార్టీకి మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు రాజీనామా చేసారు .. రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపారు అయన .. వ్యక్తిగత కారణాలతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తక్షణం తన రాజీనామా లేఖను ఆమోదించాలని తన లిఖితపూర్వక లేఖలో కోరారు. ఎన్నికల ముందు అయన జనసేన తీర్దం పుచ్చుకున్నారు .. అయితే ఈ ఎన్నికల్లో అయన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి రావెల ఓడిపోయారు. ఈ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత గెలిచారు .. ఈ రోజు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం అయిన బీజేపి లో చేరోచ్చునని తెలుస్తుంది ..