ముగిసిన మంత్రుల ప్రమాణస్వీకారం..ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ జట్టు అయిన 25 మంది కేబినేట్ మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.. సీఎం జగన్ తో సహ వైసీపీ ఎమెల్యేలు ఎంపీలు ఈ కార్యక్రమానికి హజరయ్యారు .. అమరావతి సెక్రటేరియట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ వేడుక జరిగింది .. మొదటగా శ్రీకాకుళం జిల్లా నుండి మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రమాణస్వీకారం చేసారు ..చివరగా శంకర్ నారాయణ ప్రమాణస్వీకారం చేసారు . ఇలా జిల్లాల వారిగా మొత్తం 25 మంది ప్రమాణస్వీకారం చేసారు . ఈ కార్యక్రమానికి మంత్రుల కుటుంబ సభ్యులు హజరయ్యారు. సభ ముగిసిన అనంతరం గవర్నర్ తో కలిసి జగన్ కూడా వెళ్ళిపోయారు ...