రేపు అన్నిశాఖల అధికారులతో బేటీ కానున్న‌సీఎంరేపు అన్నిశాఖల ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముందు సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఐదేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలతో పాటు నవరత్నాలు, అవినీతి రహిత పాలనపై సీఎం జగన్ చర్చ జరపనున్నారు. అలాగే వివిధశాఖల పరిస్థితి, మార్పులపై జగన్‌ నివేదిక కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 మందితో పూర్తిస్థాయి కేబినెట్‌ను శనివారం ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాల నుంచి ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారి జాబితాను ముఖ్యమంత్రి గవర్నర్‌కు అందజేశారు.