ఒక అడుగుతోనే మొదలౌవుతుంది: వరప్రసాద్‌కు పవన్ సూచనజనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. రాపాక వరప్రసాద్‌కు పవన్ అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురు కాసేపు తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు. ఇకపోతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజల తరఫున పోరాడాలని రాపార వరప్రసాద్‌కు పవన్ కళ్యాణ్ సూచించారు. అసెంబ్లీలో ఒక్కడ్నే కదా అని ఆలోచించవద్దని ఏదైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందని పవన్ కళ్యాణ్ వరప్రసాద్‌కు సూచించారు. అనంతరం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. రాపాక వరప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు. జనసేన పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఏకైక ఎమ్మెల్యే వరప్రసాదరావు కావడం విశేషం.