జబర్దస్త్ ని వీడనున్న రోజా...!జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో.. ఫ్యామిలీ అంతా కూర్చొని మస్త్ జబర్దస్త్‌గా ఎంజాయ్ చేసే బుల్లితెర ట్రీట్ ఇది. అంతేకాదు ఈ షో ప్రసారం చేస్తున్న టీవీ ఛానెల్ వారికి అంతులేని టీఆర్పీ రేటింగ్ తెచ్చిన ఏకైక షో కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. యాంకర్ అనసూయ అందాల విందులు, న్యాయనిర్ణేతలు నాగబాబు, రోజా నవ్వులు, స్కిట్లు చేసేవారి వేషాలు అన్నీ ఈ షోలో దేనికవి ప్రత్యేకమే. ముఖ్యంగా తనదైన డైలాగులతో ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడంలో రోజా ఎప్పుడూ ముందే.
 
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైందో అప్పటి నుంచి రోజా పై అనుమానాలు మొదలయ్యాయి. రోజా గెలిస్తే ఇక జబర్దస్త్ నుంచి రోజా బయటకు వచ్చేస్తుందని ఆడియన్స్ బెంగ పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజాతో గెలుపుతో పాటు ఆమె నాయకుడు వైఎస్ జగన్ కూడా విక్టరీ సాధించాడు. దీంతో ఇన్నాళ్లు ఇటు రాజకీయాల్ని, అటు జబర్దస్త్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన రోజా ఇక జబర్దస్త్‌కి సెలవు ప్రకటించనుంది అనే టాక్ జోరుగా నడిచింది.
 
అయితే ఎన్నికల్లో విజయం సాధించాక కూడా రోజా జబర్దస్త్ తెరపై కనిపించి షాకిచ్చింది. ఎప్పటిలాగే తన చిరునవ్వులతో బుల్లితెర ఆడియన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ లోగా జగన్ మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గర పడటం, ఆమెకు కీలక పదవి దక్కే అవకాశం ఉండటంతో ఇంకా కొన్ని రోజులే జబర్దస్త్ షోలో రోజా కనిపిస్తుందనే టాక్ బాగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రోజాకి పొలిటికల్‌గా పెద్ద పదవి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జగన్ కేబినెట్‌లో ఆమెకు మంత్రి పదవి దక్కడం ఖాయం, అది మిస్ అయితే స్పీకర్ పదవి ఖాయం అంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు. ఇదే జరిగితే రాజకీయ ఒడిలో బిజీగా ఉండాల్సిన పరిస్థితి రోజాది. కాబట్టి ఆమె మరికొద్ది రోజుల్లోనే జబర్దస్త్ వదిలి పెట్టనుందని అంటున్నారు.