రాజన్నలా పాలన సాగించండి... జగన్ తో పి.సుశీలదివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలానే జగన్ కూడా ప్రజారంజక పాలన సాగించాలని ప్రముఖ సినీ గాయని పి.సుశీల ఆకాంక్షించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీకి, పార్టీ అధినేత జగన్ కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఎందరో కళాకారులను ఆదుకున్నారని, ప్రోత్సాహమిచ్చారని గుర్తు చేసుకున్న సుశీల, జగన్ కూడా అదే విధమైన పాలన సాగించాలని అభిలషించారు.