కాంగ్రెస్ కు షాకిచ్చిన శరథ్ పవార్...పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమి ఎంత పనిచేస్తోంది. దశాబ్ధాలుగా ఉన్న మిత్రులను కూడా దూరం చేస్తోంది. కొన్నేళ్లుగా స్నేహంగా ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఇక దోస్తీకి కట్ చెప్పాయి. కాంగ్రెస్ తో కలిసి నడిచేది లేదని ఎన్సీపీ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ షాక్ కు గురైంది..స్పీపీ అధినేత శరద్ పవార్.. కాంగ్రెస్ కు సోనియాకు నమ్మిన బంటు.. ప్రతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి పోటీ చేస్తుంటాయి. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో వీరి పొత్తు వికటించింది. పోయిన సారి వచ్చినన్నీ సీట్లు రాలేదు. పైగా ఓట్ల శాతం కూడా తగ్గడంతో ఇక కాంగ్రెస్ తో కలిసి నడిస్తే తమ పుట్టి మునుగుతుందని ఎస్పీపీ కఠిన నిర్ణయం తీసుకుంది.
 
త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కాంగ్రెస్ తో దోస్తీకి కటీఫ్ చెప్పి సొంతంగా పోటీచేయడానికి ఎన్సీపీ రెడీ అయ్యింది. కాంగ్రెస్ తో ఇక పొత్తు  ఉండదని ప్రకటించింది. మహారాష్ట్రలోని ఒక ప్రాంతంలో ఎన్సీపీకి గట్టి పట్టు ఉంది. కాంగ్రెస్ తో పోత్తువల్ల ఇప్పుడు అక్కడ కూడా గెలవలేకపోయింది. పైగా బీజేపీ-శివసేన కూటమి భారీగా పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు సాధించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారు మరింత ఉత్సాహంగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తో కలిసినడవక సొంతంగా పోటచేస్తేనే కాసిన్ని సీట్లు సాధించగలమని.. మళ్లీ ఉనికి చాటుకోగలమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇలా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.