తిరుమల: వీవీఐపీ దర్శనాలపై వెంకయ్య నాయుడు షాకింగ్ కామెంట్స్...ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆయన వీఐపీ దర్శనాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు మీడియా తో మాట్లాడారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి స్వామీజీకి ఆహ్వానం ? అందుకేనా జగన్ విశాఖ పర్యటన వైకుంఠం1 క్యూ కాంప్లెక్స్ ద్వారా వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆలయ అర్చకులు భారత ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు.
 
ఇవాళ ఉదయం వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు.స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల‌ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన‌ మీడియాతో మాట్లాడారు. యాధ్బావం తద్భవతి అన్న ఆయన దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు.ఆకలి అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలని తానూ కాంక్షిస్తున్నట్టు వెల్లడించారు .