హాట్ హాట్‌గా శ్రీయా, ఆండ్రూ...హాట్ హీరోయిన్ శ్రీయా సరన్ వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. షూటింగ్ బిజీ నుంచి తేరుకొని భర్త అండ్రూ కొశ్చెవ్‌తో కలిసి మెక్సికోలో విహారయాత్రకు వెళ్లింది. సముద్ర తీరంలో భర్తతో కలిసి నాటు భంగిమలతో దిగిన ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. మెక్సికోలో అండ్రూ, శ్రీయ సరన్ ఫొటోలు మీడియాలో కాక పుట్టిస్తున్నాయి. బీచుల్లో వారు చేసిన హంగామా నెటిజన్లు ఆకట్టుకొంటున్నది. 
 
భర్త సంకలోకి ఎక్కి దిగిన ఫొటోపై భారీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోకు ఆర్మ్స్ డే అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ విహార యాత్రను శ్రీయ, అండ్రూ ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తున్నది. ఇటీవల తమిళ మీడియాతో మాట్లాడుతూ.. పిల్లల్ని ఇప్పుడే కనకూడదు అని అనుకొంటున్నాను. లైఫ్‌ను, కెరీర్‌ను బాగా ఎంజాయ్ చేయాలని కోరుకొంటున్నాను. సంతానం కోసం తొందరపడటం లేదు. మరో 20 సినిమాలు చేసిన తర్వాత పిల్లల్ని కనే విషయం గురించి ఆలోచిస్తాను అని శ్రీయ సరన్ చెప్పింది.