వైకాపా కార్యకర్తల తిరుపతి పాదయాత్ర‌సత్తెనపల్లి,జనవారధి: వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా, సత్తెనపల్లి నియోజకవర్గం నుండి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో మొక్కు తీర్చుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరుపతికి పాదయాత్రగా బయలుదేరారు.మండలంలోని భట్లూరు గ్రామానికి చెందిన సుమారు 10మంది అభిమానులు వైకాపా అధికారంలోకి వస్తే తిరుపతి పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నారు.
 
ఇందులో భాగంగానే శుక్రవారం ఆ పార్టీకి చెందిన వైసిపి నాయకులు సైదారావు, బి. శ్రీనివాసరావు, మల్లయ్యలు యాత్ర ప్రారంభించి సత్తెనపల్లి చేరుకున్న సందర్భంగా ఆ పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్ మాట్లాడుతూ వైకాపా శ్రేణుల అభిమానం అభినందనీయమన్నారు.దేవుని దయ,ప్రజల ఆశీస్సులతోనే అంబటికి భారీ మెజార్టీ దక్కిందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో  కూకుట్ల శ్రీనివాస్, తిరుమల,బ్రహ్మానంద రెడ్డి , శ్రీను పాల్గొన్నారు.