ప్రపంచకప్ 2019 అసలు సమరానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచుకు వార్నర్ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఓ ప్రకటనలో తెలిపాడు. డేవిడ్ వార్నర్ రెండవ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. వార్నర్ కుడి తొంటిలో గాయమైంది. దీంతో శ్రీలకంతో జరిగిన వార్మప్ మ్యాచ్ ఆడలేదు. ఇక బుధవారం ఆసీస్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కూడా వార్నర్ పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో గురువారం వార్నర్‌కు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించగా.. అతను అన్‌ఫిట్ అని తేలినట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో అఫ్గానిస్తాన్‌తో జరిగే తొలి ప్రపంచకప్ మ్యాచ్‌కు వార్నర్ దూరమయ్యే అవకాశం ఉంది.
వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్...
