రామ్ గోపాల్ వర్మ రూములో అమ్మాయిలు!ఏపీలో జగన్ ప్రభుత్వం రావడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ప్రస్తుతం స్వేచ్ఛగా తన సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. హ్యాపీ మూడ్లో ఉన్న ఆర్జీవీ విజయవాడలో ఉల్లాసంగా విహరిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చదువుకున్న సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ రోజుల జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా నలుగురు అమ్మాయిలతో కలిసి దిగిన ఓ సెల్ఫీ పిక్ హాట్ టాపిక్ అయింది.
 
తాను చదవుకుంటున్న రోజుల్లో విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వెనక వైపు ఒక రూములో ఉండేవారు. ఈ రోజుల్లో తాను నివాసం ఉన్న ఆ రూమును తాజాగా రామ్ గోపాల్ వర్మ సందర్శించారు. ఇపుడు దాన్ని లేడీస్ హాస్టల్‌గా మార్చడంతో ఆ రూములో అమ్మాయిలు ఉంటున్నారట. ఈ రూములో నేను 2 సంవత్సరాలు నివాసం ఉన్నాను. ఇదే గోడపై శ్రీదేవి పోస్టర్ అంటించుకుని ఆమెను ఊహించుకుని డ్రీమ్స్‌లో విహరించే వాడిని. ఇపుడు ఈ నలుగురు అమ్మాయిలు ఇందులో ఉంటున్నారు... అంటూ వారితో కలిసి దిగిన పిక్ వర్మ షేర్ చేశారు.