ఏపీలో చంద్రబాబు గెలవడం లేదు...స్టాలిన్ తో కేసీఆర్!



దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఫలితాల సరళి ఎలా ఉందో తన అంచనాలను ఆయనకు వివరించారు. వివిధ పార్టీల అధినేతల ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా చంద్రబాబు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ‘‘23వ తేదీ ఫలితాల వెల్లడి తర్వాత అందరం అప్రమత్తంగా ఉండాలి. ఎంపీలకు ఎర వేయడానికి... పార్టీల్లో చీలికలు తేవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అన్నీ చూసుకోండి. బీజేపీ వచ్చే అవకాశం లేదని తెలిస్తే మెజారిటీ పార్టీలు మన వైపు తిరుగుతాయి. రకరకాల ప్రతిపాదనల పేరుతో వాటిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కొత్త కొత్త ఫ్రంట్లను తెరపైకి తెస్తారు. తాను నేరుగా అధికారంలోకి రాకపోయినా తన ప్రభావం ఉండే ప్రభుత్వం ఏర్పడాలని అయినా బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇవన్నీ చూసుకోవాలి. మనం టచ్‌లో ఉందాం’’ అని ఆయనతో చంద్రబాబు చెప్పారు.
 
 ఈ భేటీ తర్వాత దొరై మురుగన్‌ తన సతీమణితో కలిసి విజయవాడలో కనకదుర్గ దేవాలయాన్ని సందర్శించి అనంతరం చెన్నై వెళ్లిపోయారు.కేసీఆర్‌, స్టాలిన్‌ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఏపీలో మీరు అనుకొంటున్నట్లు చంద్రబాబు గెలవడం లేదు. జగన్‌ గెలుస్తున్నారు. ఆయనకు ఎంపీ సీట్లు 18 నుంచి 21 వరకూ వస్తాయి’’ అని కేసీఆర్‌ చెప్పారు. ‘అది మీ అభిప్రాయం కావచ్చు’ అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ మంగళవారం చంద్రబాబుకు దొరై మురుగన్‌ వివరించారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితిని, ఇటీవల జరిగిన ఎన్నికల సరళిని చంద్రబాబు ఆయనను అడిగి తెలుసుకొన్నారు.