పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న స‌ల్మాన్‌?అవునండీ ఇప్పుడు బాలీవుడ్‌లో లేటెస్ట్‌గా విన‌ప‌డుతున్న రూమ‌ర్ ఇది. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒక‌రైన కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ఐదు ప‌దుల వ‌య‌సు దాటినా పెళ్లి గురించి ప‌ట్టించుకోకుండా సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న పెళ్లిపై ఇది వ‌ర‌కు చాలా వార్త‌లే వినిపించాయి. సాధార‌ణంగా ఈయ‌న త‌న సోద‌రి పిల్ల‌ల‌తో చాలా స‌ర‌దాగా ఉంటారు. అయితే ఇప్పుడు స‌ల్మాన్‌ఖాన్ త‌నే తండ్రి కావాల‌నుకుంటున్నార‌ని బాలీవుడ్‌లో వార్త‌లు గుస‌గుస‌లు ప్రారంభ‌మ‌య్యాయి. వివ‌రాల ప్ర‌కారం స‌ల్మాన్ స‌రోగ‌సీ ప‌ద్ధ‌తిలో తండ్రి కావాల‌నుకుంటున్నార‌ట‌. ఈ ప‌ద్ధ‌తిలో బాలీవుడ్‌లో షారూక్ దంపతులు, ఆమిర్‌ఖాన్ దంప‌తులు, టాలీవుడ్ మంచు ల‌క్ష్మి దంప‌తులు త‌ల్లిదండ్రుల‌య్యారు. అలాగే సింగిల్‌గా ఉండే క‌ర‌ణ్ జోహార్ 2017లో స‌రోగ‌సీ ప‌ద్ధ‌తిలో క‌వ‌ల‌లకు తండ్రి కాగా, ఏక్తాక‌పూర్ 2019లో ఓ బాబుకు తల్లిగా మారింది. ఇప్పుడు సింగిల్‌గా ఉన్న క‌రణ్ జోహార్‌, ఏక్తాక‌పూర్ లిస్టులో స‌ల్మాన్ కూడా చేరుతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.