రిలీజ్ డేట్ మారిన 'సైరా'....మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న 151వ మూవీ ‘సైరా’. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ యమా స్పీడ్‌గా జరుగుతోంది. ఇటీవలే చిరంజీవి ఫామ్ హౌస్‌లో సెట్ తగలబడ్డప్పటికీ.. షూటింగ్ పార్ట్ డిస్ట్రబ్ కాకుండా వెంటనే మరో సెట్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే.. సైరా మూవీ విడుదల తేదీపై కొత్త వార్తలు బైటికొస్తున్నాయి. ఈ ఏడాది దసరాకి విడుదల చేయాలని ముందునుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నయూనిట్.. ఇప్పుడు ప్లాన్ బీని కూడా వర్కవుట్ చేస్తున్నారు. గాంధీ జయంతి (అక్టోబర్ 2)న విడుదల చేస్తే.. వీకెండ్‌తో పాటు.. దసరా సెలవులు కూడా కలిసొస్తాయని, ఈ లాంగ్ స్ట్రెచ్‌తో వసూళ్లు మరింత ఎక్కువగా దండుకోవచ్చని చూస్తోంది కొణిదెల ప్రొడక్షన్స్. విడుదల తేదీని ఐదారు రోజులు ముందుకు జరపడం ద్వారా.. ప్రొడక్షన్ వర్క్ మీద ఒత్తిడి పెద్దగా పెరగదన్న అంచనాతో.. ఈ మేరకు ఫిక్స్ కానున్నారు ‘సైరా’ మేకర్స్. దీంతో పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్స్ మరింత వేగవంతం కానున్నాయి.