'సైరా' సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం'సైరా' సెట్‌లో భారీ అగ్ని ప్రమాదంమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం కోకాపేట‌లోని చిరంజీవి ఫార్మ్ హౌస్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో జ‌రుగుతుంది. అయితే ఈ సెట్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఫాం హౌజ్ నుండి ద‌ట్ట‌మైన పొగ‌లు, మంట‌లు వ‌స్తుండడాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. గండిపేట లేక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సెట్‌ పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న జ‌రిగిందా లేదంటే మ‌రేదైన కార‌ణం వ‌ల‌న జ‌రిగిందా అనే దానిపై విచార‌ణ జ‌రుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.