ఆమె నా జీవితం అంటున్న హీరో వరుణ్ ధావన్!బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా విడుదలైన కళంక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వ్యక్తిగత విషయానికి వస్తే ఈ మధ్య పెళ్లి వార్తల మధ్య హీరో వరుణ్ ధావన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. గత కొద్దికాలంగా నటాషా దలాల్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ యువ నటుడు.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. ఇంతకు వరుణ్ ఏమన్నారంటే.. తన ప్రియురాలు నటాషాతో డిసెంబర్‌లో పెళ్లి.. ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో విస్త్రృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే వరుణ్ పెళ్లి వార్తలపై ఆయన తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ స్పందించారు. వచ్చే ఏడాది వరుణ్ పెళ్లి జరిగే అవకాశం ఉంది అని పేర్కొన్నాడు.
 
తన తండ్రి డేవిడ్ ధావన్ స్పందనపై వరుణ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నా పెళ్లి జరగొచ్చు. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నాను. నా తండ్రి నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. నా తండ్రి ఆకాంక్షలకు ఎప్పుడూ లోబడి ఉంటాను. నా అభిప్రాయాలను నా తల్లిదండ్రులు గౌరవిస్తారు అని అన్నారు. వరుణ్ ధావన్ ఇటీవల కరణ్ జోహర్ షోలో మాట్లాడుతూ.. నా ఆలోచనలు ఎప్పుడూ నటాషాతోనే ఉంటాయి. స్వతంత్రంగా ఉండే ఆమె తీరు నాకు బాగా నచ్చుతుంది. ఏదైనా విషయంపై తన అభిప్రాయాన్ని కచ్చితంగా, స్పష్టంగా చెబుతుంది. జీవితంలో ఏదో సాధించాలనే తపన చూస్తే మరీ ఇష్టం అని తెలిపారు.