సాహో’ సెట్స్.. ప్రభాస్‌తో మంత్రి గడ్కరీ ముచ్చట్లుస్టార్ హీరో ప్రభాస్ ఫిల్మ్ ‘సాహో’ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముంబైలోని కర్జాత్ స్టూడియోలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పాట్‌ని విచ్చేశారు. కాసేపు ప్రభాష్‌తో మాట్లాడారు గడ్కరీ. అలాగే కృష్ణంరాజు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ప్రభాస్‌, సుజీత్‌, శ్రద్దా క‌పూర్‌తో క‌లిసి గ‌డ్కరీ దిగిన పిక్స్ సోష‌ల్‌మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. వున్నట్లుండి గడ్కరీ ప్రభాస్‌తో ఎందుకు భేటీ అయినట్టు? నార్త్‌లో ఈ హీరోకున్న క్రేజ్‌కి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? బాహుబలి తర్వాత నార్త్‌లో ప్రభాస్‌కి ఫాలోయింగ్ బాగానే పెరిగింది. 
 
సాహోలోనూ చాలావరకు బాలీవుడ్ నటులున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ని కలిసి వుండవచ్చని సినీ లవర్స్ అంటున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతోపాటు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. స్పై థ్రిల్ల‌ర్ గా రానున్న ఈ ఫిల్మ్‌లో శ్రద్ధాక‌పూర్‌తోపాటు నీల్‌నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి స్టార్స్‌ కీలకపాత్రలు చేస్తున్నారు.