ఈసీపై మండిపడ్డ కోడెల...సత్తెనపల్లి; జనవారధి: ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లేని అధికారాలను వినియోగించి ఈసీ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఎన్నికలు జరిపించిందన్నారు. గతంలో ఎన్నాడు లేనివిధంగా ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికలకు ఓట్ల లెక్కింపుకు 40 రోజల వ్యవధి వుండటం బాధకరమని ఇది ప్రజాపాలనకు ఆటకం కలిగిస్తుందన్నారు. విజయసాయిరెడ్డి ఏం చెబితే ఎన్నికల కమిషన్ ఆది చేస్తుందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యనికి మంచిదికాదని హితవుపలికారు. కేంద్రంలో, తెలంగాణలో లేని ఆంక్షలు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకని ప్రశ్నించారు. 
 
ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చీకటి రోజులని స్పీకర్ కోడెల చెప్పారు. ఈసీకి వాస్తవ దృక్పథం లేకపోవడం బాధకరమని సియస్ తో రాప్టాన్ని నడిపించాలనుకోవటం మంచిది కాదన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే పక్కన బెట్టి సియస్ తో పరిపాలన చేయించమని ఏ చట్టం చెబుతోందని ఆయన ప్రశ్నించారు. ఇనిమెట్ల ఘటనపై నేను చిత్తశుద్ధితో వున్నానని అక్రమ కేసులకు నేను భయపడనని తెలిపారు. ఐదేళ్ళ తరువాత కనబడ్డ అంబటి ఇప్పుడు ఓడిపోతే జీవితకాలం కనబడడన్నారు.