మహిళల ఆశీస్సులతో టిడిపిదే విజయం:రాయపాటిమహిళల ఆశీస్సులతో టిడిపిదే విజయం:రాయపాటి
 
అమరావతి,జనవారధి:రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అదించిన ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంపి రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు.మవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ప్రజాసమస్యలపై శాసనసభ్యులు,పార్లమెంటు సభ్యులతో సి‍ఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ..తాము అధికారంలోకి రాబోతున్నామని వైసిపి నేతలు  మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు.మరొక నెలరోజులపాటు మోడీ,కేసిఆర్,జగన్ కుట్రలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని రాయపాటి పేర్కొన్నారు.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం తధ్యమన్నారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కర్పూరపు దండ వేసి,శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.