కలెక్షన్లతో హోరెత్తిస్తున్న కాంచన 3....మాస్ హీరో లారెన్స్ రాఘవ స్వీయ దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం కాంచన 3. లారెన్స్ రూపొందించిన ముని సినిమాకు మూడో సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో లారెన్స్ సరసన వేదిక, ఓవియా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట మాస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో కాంచన 3 సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
 
కాంచన 3 చిత్రం నైజంలో మంచి వసూళ్లను రాబడుతున్నది. జెర్సీ చిత్రం నుంచి మంచి పోటీ ఎదుర్కొని క్రేజీ నంబర్లను నమోదు చేసింది. కాంచన 3 చిత్రం నైజాంలో గత మూడు రోజుల్లో రూ.3 కోట్ల 5 లక్షలను రాబట్టింది. ఇక సీడెడ్‌లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో రూ.2.05 కోట్లు వసూలు చేసింది.ఆంధ్రలో కూడా కాంచన 3 చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా కృష్ణా జిల్లాలో రూ.69.23 లక్షలు, వైజాగ్‌లో రూ.96.04 లక్షలు, నెల్లూరులో రూ.32.06 లక్షలు, గుంటూరులో 85 లక్షలు, పశ్చి గోదావరి జిల్లాలో రూ.51 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.75 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కాంచన 3 చిత్రం 2600 స్క్రీన్లలో రిలీజైంది. గత మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.15.20 కోట్ల గ్రాస్ 9.13 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో గత మూడు రోజుల్లో రూ.30 కోట్ల రూపాయాల గ్రాస్‌ను వసూలు చేసింది.