దీక్షలకు అనుమతుల్లేవు:డిఎస్పీదీక్షలకు అనుమతుల్లేవు:డిఎస్పీ
డివిజన పరిధిలో 60కేసులు నమోదు
ఇనిమెట్ల ఘటనలో 6గురి అరెస్ట్
పై అధికారుల ఆదేశాల మేరకు కోడెలపై నమోదు చేస్తాం:
మీడియాతో డిఎస్పీ కాలేషావలి
 
సత్తెనపల్లి,జనవారధి:డివిజన్ పరిధిలో సుమారు 4లక్షల మంది ఓటర్లకు కేవలం 600మంది సిబ్బందితో ఇనిమెట్ల సంఘటన మినహా ప్రశాంతమైన పోలింగ్ జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి  డిఎస్పీ కాలేషావలి ధన్యవాదాలు తెలిపారు.మంగళవారం పట్టణ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమవేశంలో డిఎస్పీ కాలేషావలి మాట్లాడుతూ..మే23 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని,ధర్నాలు,రాస్తారోకోలు,దిష్టిబొమ్మల దగ్ధం,దీక్షలు నిర్వహించటానికి అనుమతుల్లేవని ఆయన స్పష్టం చేశారు.డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 60 కేసులు నమోదు చేశామన్నారు.
 

 
ఇనిమెట్ల సంఘటనలో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామన్నారు.కోడెలపై బూత్ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.పై అధికారుల ఆదేశాల మేరకు కోడెలపై నమోదు చేస్తామని స్పష్టం చేశారు.ఎవరి కోసమో,ప్రలోభాలకు గురై శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే మూడు సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నారు.ఎన్నికల అనంతరం ప్రశాంతమైన వాతావరణం మెరుగుపడుతుందన్నారు.ఆయనతో పాటు పట్టణ సిఐ మల్లిఖార్జునరావు,రూరల్ ఎస్సై పట్టాభిరామయ్య,పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.