ఈనెల 17న అంబటి నిరాహార దీక్ష‌ఈనెల 17న అంబటి నిరాహార దీక్ష‌
కోడెలపై కేసు నమోదు చేయాలని డిమాండ్
 
సత్తెనపల్లి,జనవారధి:ఇనిమెట్ల సంఘటనలో కోడెల శివప్రసాదరావుపై 160వ బూత్ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకపోతే ఈనెల 17వ తేదిన వేలాది మంది కార్యకర్తలతో నిరాహార దీక్ష చేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు స్ధానిక పోలీసులను హెచ్చరించారు.సోమవారం స్ధానిక పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బూత్ కి సంబంధం లేని వ్యక్తి,అక్కడ ప్రత్యక్షంగా లేని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైకాపా నేతలపై కేసు నమోదు చేయటం దారుణమన్నారు.వర్గాలను,ప్రాంతాలను రెచ్చగొట్టి అశాంతిని రగిల్చే ప్రయత్నం కోడెల శివప్రసాదరవు చేస్తున్నారని విమర్శించారు.
 

 
అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అంబటి మండిపడ్డారు.ముప్పాళ్ళ ఎస్సై ఏడు కొండలు  కోడెల శివరామకృష్ణకు సెక్యూరిటీ గార్డ్ లా పని చేస్తున్నారని,నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారన్నారు.సదరు ఎస్సైపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని అంబటి వివరించారు.అధికార పార్టీ నాయకులు ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉన్నా ర్యాలీలు,దిష్టిబొమ్మలు దగ్ధం వంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా తాత్సారం వహించటం సరైన పద్దతి కాదన్నారు.
 
నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ.. గత 20ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో నా వ్యక్తిత్వమేమిటో కోడెల శివప్రసాదరావుకు స్పష్టంగా తెలుసన్నారు.పార్టీ మారినంత మారినంత మాత్రనా నా క్రమశిక్షణలోనూ,పద్దతులలోనూ ఎలాంటి మార్పు లేదన్నారు.మీరు భయపెడితే భయపడే పరిస్దితి లేదని హెచ్చరించారు.సమావేశంలో ఆయనతో పాటు చల్లంచర్ల సాంబశివరావు, ఆతుకూరి నాగేశ్వరరావు,మక్కెన అచ్చెయ్య,కట్టా సాంబయ్య,యూనస్,అచ్యుత శివప్రసాదరావు, తదితరులున్నారు.