కక్ష్యపూరితంగా వ్యవహరిస్తే సహించేది లేదు:అంబటి 
కక్ష్యపూరితంగా  వ్యవహరిస్తే సహించేది లేదు:అంబటి
కోడెల క్షమాపణ చెప్పాలి:నిమ్మకాయల  
 
సత్తెనపల్లి,జనవారధి:ఇనిమెట్ల సంఘటనలో గ్రామస్ధులపై దాడులు జరిగినా,పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించినా సహించేది లేదని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు హెచ్చరించారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇనిమెట్లలో జరిగిన ఘటనలో కోడెలపై దాడి కేవలం ఆయన వైఖరివల్లే తప్ప ఎవ్వరు ప్లాన్ చేసింది కాదన్నారు.పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులు వేసుకోవటంతోనే ఓటర్లలో ఆందోళన మొదలైందన్నారు.లోపల రిగ్గింగ్ చేస్తున్నారని అనుమానంతోనే పరిస్ధితి ఆందోళనకరంగా మారిందన్నారు.తలుపులు వేసుకోవాల్సిన అవసరమేంటని,నీవెంట పేట రౌడీలు ఎందుకున్నారని,నిబంధనలకు విరుద్ధంగా  గంటన్నర సేపు పోలింగ్ బూత్ లో మీకేం పని అంటూ అంబటి ప్రశ్నించారు.
 
సత్తెనపల్లి ఎన్నికల నేర చరిత్ర ఉన్న నియోజకవర్గం కాదన్నారు.అది కోడెలకు,నరసరావుపేటకు చెందిందన్నారు.ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి దారుణాలకు దిగారని విమర్శించారు.పోలీసులు చెప్పిన కోడెల బూత్ లో నుండి బయటకు రాకపోవటమే ఈ సంఘటనకు కారణమన్నారు.అంతేగాని తాను,నిమ్మకాయల,బసు లింగారెడ్డిలు  ఒక పధకం ప్రకారమే దాడి చేపించారని ఆరోపించడం సమంజసం కాదన్నారు.నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అలాంటివి ఎప్పుడు జరగలేదన్నారు.కోడెలకు మాత్రమే అలాంటి సంస్కృతీ ఉందన్నారు.కోడెల క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు.బాసు లింగారెడ్డి తదితరులు ప్రసంగించారు.
 
ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ నాగుల్ మీరాన్,చెల్లంచర్ల సాంబశివరావు,ఆతుకూరి నాగేశ్వరరావు,సయ్యద్ మాబు,అచ్యుత శివ ప్రసాద్,కట్టా సాంబయ్య,నరసింహ్మారావు,కోడిరెక్క దేవదాసు తదితరులున్నారు.