అభివృద్ధికి అహర్నిశలు కృషిఅభివృద్ధికి అహర్నిశలు కృషి
మరోసారి అవకాశమివ్వండి 
మరింత అభివృద్ధికి చేయూతనివ్వండి:
తెదేపా అభ్యర్థులను గెలిపించండి:ఎంపీ రాయపాటి 
 
నరసరావుపేట,జనవారధి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రోత్సాహం,నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి,నిధుల సమీకరణకు,అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశానని తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు.పల్నాడు ప్రాంతంలో నీటి ఎద్దడి నివారించేందుకు అనేక మంచినీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయటం అందరికి తెలిసిందే అన్నారు.పార్లమెంట్ పరిధిలో ఏ అభివృద్ధి జరగాలన్నా,రాష్ట్ర ప్రభుత్వ సహకారం కేంద్రం నుండి నిధుల సమీకరణలో లాబీయింగే ముఖ్యమన్నారు.కొత్తగా వచ్చే ఎంపీలకు ఆయా శాఖలతో పరిచయం ఏర్పడటానికి సమయం సరిపోతుందన్నారు.ఓటర్లు అలోచించి అభివృద్ధిని కొనసాగించే వారినే గెలిపించాలని కోరారు.గడచిన ఐదేళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
 
ఎంపీ రాయపాటి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు:
నడికూడి – శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో తొలిదశ పనులు శావల్యాపురం పనులు పూర్తయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో సకరికల్లు, కుoకలగుంటలలో నూతన రైల్వే స్టేషన్లు నిర్మితమయ్యాయి.వినుకొండ, గురజాల, మాచర్ల – 600 కోట్ల వాటర్ గ్రిడ్ లు నిర్మాణం.అనువు, కొప్పునూరు ఎత్తిపోతల పధకం – రూ.100 కోట్లు, పదివేల ఎకరాలు కేటాయింపు.దుర్గి మార్కెట్ యార్డు.ధర్మవరం గ్రామం దత్తత రూ.2 కోట్లతో అభివృద్ధి.రూ.36 కోట్లతో 3600 ఎకరాలకు సాగునీటిని అందించే ఎత్తిపోతల పధకం. రూ.36 కోట్ల CSR నిధులు.వరికేపూడిసెల ఎత్తిపోతల పధకం 25 వేల ఎకరాల 340 కోట్లు మంజూరు చేసిన మఖ్యమంత్రి. మాచర్లలో 80 కోట్లు, వినుకొండలో 159 కోట్లు,పిడుగురాళ్ళలో 96 కోట్లతో త్రాగునీటి పధకాలు మంజూరు.పేరేచర్ల – కొండమోడు రహదారి నాలుగు వరసలుగా విస్తరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
 
గోదావరి – పెన్నా నదుల అనుసంధానం తొలిదశ రూ.6300 కోట్ల రూపాయిలతో హరిశ్చంద్రపురం నుండి నకరికల్లు వద్ద నాగార్జునాసాగర్ కుడి కాల్వకు నీటిని ఎత్తిపోస్తారు. భూసర్వే పూర్తయ్యింది. త్వరలో భూ సేకరాణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం కుడి కాల్వ క్రింద ఉన్న 9 లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ జరగడంతో పాటు, వందలాది గ్రామాలకు త్రాగునీరు అందుతుంది.గోదావరి - కృష్ణా నదుల అనుసంధానo (పట్టి సీమ) కారణంగా కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలోని 13 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది.సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయం మంజూరు.నరసరావుపేటలో జెన్ టియు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయిoచాము.సత్తెనపల్లి – క్రోసూరు రహదారిలో 70 కోట్లతో ఓవర్ బ్రిడ్జి మంజూరు కావటంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు విశేషంగా కృషి చేశారు.