ముగ్గురు దుష్ట శక్తులను బంగాళాఖాతంలో కలపండికేసీఆర్,జగన్ లు మోడీ పెంపుడు కుక్కలు
ముగ్గురు దుష్ట శక్తులను బంగాళాఖాతంలో కలపండి 
సత్తెనపల్లికి వరాల జల్లు కురిపించిన సీఎం 
కోడెలకు చంద్రబాబు ప్రశంసలు 
సత్తెనపల్లిలో ఆసక్తికరంగా సీఎం ప్రసంగం 
 
సత్తెనపల్లి,జనవారధి:దేశంలో 66 మంది,ఐపీఎస్,ఐఏఎస్ లు ఎన్నికల కమిషన్ సక్రమంగా పనిచేయటం లేందంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చని,ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.ఐదు వీవీ ప్యాట్లే లెక్కిస్తామని సుప్రీకోర్టు అంటోందని, ఈవీఎంలలో అక్రమాలపై పోరాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి  రోడ్ షోలో మాట్లాడుతూ ‘ఖబడ్ధార్ కేసీఆర్  ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండు...తప్పుడు పనులుచేస్తే దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుందని హెక్కరించారు.మనల్ని ఓడించేందుకు మోడీ ఆధ్వర్యంలో కేసీఆర్ జగన్ లు కుయుక్తులు పన్నుతున్నారంటూ  చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఇప్పుడు మోదీ గెలిస్తే దేశంలో ఇక ఎన్నికలే ఉండవని చంద్రబాబు అన్నారు. జగన్‌, కేసీఆర్‌పై పల్నాటి పౌరుషం చూపించాలన్నారు.
 
జగన్ను చూసి పెట్టుబడులు వస్తాయా..?
240  రోజులు కోర్టుల చుట్టూ,24 రోజులు అసెంబ్లీకి వచ్చే జగన్ చూసి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని విమర్శించారు. తాను సీఎం అయితే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయా?, లేక కోడికత్తి పార్టీకి వస్తే వస్తాయా?...ప్రజలు ఆలోచించాలన్నారు. భావి తరాల భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలివని, ఒక్కసారని వైసీపీకి ఓటేస్తే తీవ్రంగా మనం నష్టపోతామని చంద్రబాబు అన్నారు.వైసీపీకి ఓటేస్తే ఏపీకి నీళ్లురావని, శ్రీశైలం, సాగర్‌ కేసీఆర్‌ చేతుల్లోకి వెళ్తుందని చంద్రబాబు అన్నారు. కేసుల కోసం భయపడి జగన్‌ రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని సీఎం ఆరోపించారు. 
 
జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని, పనులన్నీ అన్యాయాలేనని అన్నారు. రేపటి ఎన్నికల్లో జగన్‌ వెనుక ఉండేది మోదీ, కేసీఆరే అని, మనల్ని ఎంత అణచాలని చూస్తే... అంతపైకి ఎగరతామని బాబు అన్నారు. గోదావరి నీళ్లు సాగర్‌ కుడి కాల్వకు తీసుకొస్తామన్నారు. చింతలపూడి లిఫ్ట్‌ ద్వారా సాగర్‌ ఎడమ కాల్వకు.. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.ప్రస్తుతం రెండు వేలు ఇస్తున్న ఫించన్ ను మళ్ళీ అధికారం లోకి వస్తే రూ.త్రీ వేలు పెంచుతామన్నారు.జాబు రావాలంటే బాబు రావాలన్నారు.ఇంటర్ విద్యార్థులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు.కాంట్రాక్టు ఎంప్లాయిస్ కి అండగా ఉంటామన్నారు..
 
కోడెలపై ప్రసంశలు   
175 నియోజకవర్గాలకు సత్తెనపల్లిలో జరిగిన మరుగుదొడ్ల నిర్మాణం ఆదర్శమన్నారు.కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో సత్తెనపల్లిని తెలుగుదేశం పార్టీ కంచుకోటలా చేసారని ప్రశంసించారు.కేంద్రీయ విద్యాలయం,100 పడకల వైద్యశాల.అన్న క్యాంటిన్,మోడల్ పోలీస్ స్టేషన్,రోడ్ల విస్తరణ,పక్కాఇల్లు,మసీదు నిర్మాణం,ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భావనలతో పాటు,కొండమోడు నుండి పేరిచర్ల వరకు రూ.735 కోట్లతో రహదారి విస్తరణ జరుగుతోందన్నారు.ఈ అభివృద్ధికి కారణమైన కోడెల శివప్రసాదరావును గెలిపించాలని కోరారు. అనుభవజ్ఞ్జుడైన ఎంపీ రాయపాటి సాంబశివరావును కూడ మరోసారి పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.
 
సత్తెనపల్లికి వరాల జల్లు:
అచ్చంపేట రోడ్డులో రేల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం,ముస్లిం సామజిక వర్గానికి ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డ్ మార్పు,ఆర్యవైశ్యులకు షాపింగ్ కాంప్లెక్స్ వంటి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.పట్టణంలో ముస్లింలు ముస్లిం  సోదరులు అధికంగా ఉన్నారంటూ ప్రస్తావిస్తూ,మీకు ప్రోత్సాహంగా ఉప ముఖ్యమంత్రి పదవిని మీ సామజిక వర్గానికి కేటాయిస్తున్నట్లు చెప్పారు.ముందుగా హెలిప్యాడ్ వద్ద నుండే సీఎంకు స్వాగతం పలికేందుకు ఆర్యవైశ్య,ముస్లింలకు ప్రత్యేక స్ధానం కేటాయించటం,సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఆయా వర్గాలను ప్రస్తావించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత లభించటం సభాపతి కోడెలకే సాధ్యమంటూ పార్టీ నాయకులతో పాటు,స్ధానికులు కూడ చర్చించుకోవటం విశేషం.