ఖరారైన కొమ్మాలపాటి విజయంఖరారైన కొమ్మాలపాటి విజయం 
అనుభవం,అభివృద్ధితో పోటీ పడలేని వైకాపా నేత 
అభివృద్ధి కొనసాగాలని ప్రజల ఆకాంక్ష 
 
పెదకూరపాడు,జనవారధి:పదేళ్ల పటు నియోజకవర్గంలో పనిచేసిన నేత,ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి అభివృద్ధిని పరుగులు పెట్టించిన నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్.ఈ అభివృద్ధి అనుభవంతో పోటీ పడలేక ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ నేత శంకర్రావు ఎన్నికల ప్రచారంలో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.గ్రామాల్లో క్రమశిక్షణ గలిగిన బలమైన కార్యకర్తలున్న తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ విజయానికి కీలకంగా మారనుంది.ఎన్నికల ముందు వరకు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చటం,క్షేత్ర స్ధాయిలో పూర్తీ స్ధాయిలో కమిటీలన్నీ పనిచేయకపోవటం ఆ పార్టీ అభ్యర్థి శంకర్రావుకు తలనొప్పిగా మారింది.
 
రాజ‌కీయాల్లో నేత‌ల మ‌ధ్య పోటీ సాధార‌ణ‌మే. ఎన్నిక‌ల వేళ‌.. కుటుంబ స‌భ్యులే త‌ల‌ప‌డుతున్న నేటి రోజుల్లో అంతా ఆస‌క్తిగానే ఉంటోంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో పెదకూరపాడు నేత‌ల మ‌ధ్య పోటీ తాట తీస్తోంది. ఈ క్ర‌మంలో వైసిపి అభ్యర్ది నంబూరు శంకర్రావు గెలుపు గుర్రం ఎక్కేందుకు స‌ర్వం ఒడ్డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు వరసగా పోటీ చేసి గెలుపొందిన కొమ్మాలపాటి శ్రీధర్ తన  అనుభవంతో..మూడోసారి హ్యాట్రిక్కు సిద్ధమవుతున్నారు.త‌న గెలుపును సాకారం చేసుకునేందుకు అభివృద్ధిని అస్త్రంగా చేసుకుని కొమ్మాలపాటి ప్రచారంలో ముందుకు సాగుతుంటే..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుపై ఆశ పెట్టూకున్నారు నంబూరు.చివరగా ఇక్కడ కొమ్మాలపాటికే కొంచెం అనుకూలంగా కనిపిస్తోంది.