అనుమానాల్లేవ్.. రాయపాటిదే విజయంఅనుమానాల్లేవ్.. రాయపాటిదే విజయం 
అభివృద్ధే ఆయన గెలుపు మంత్రం
అనుభవమే విజయ సూత్రం 
పేటలో రాయపాటి పాగా ఖాయం 
 
గుంటూరు,జనవారధి:పార్టీ ఏదైనా..పోటీ ఎక్కడైనా రాయపాటి సాంబశివరావు గెలుపే లక్ష్యంగా పనిచేస్తారు.అట్టహాసం లేకుండా,ఆర్భాటం కాకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించటంలో,పోల్ మేనేజ్ మెంట్ లో రాయపాటి ఘనాపాటి అని చెప్పవచ్చు.పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గముంది.పల్నాడు ప్రాంతంలోని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపట్ల ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది.ఈ అనుభవంతోనే ఈ ప్రాంత మంచినీటి కొరతను అధిగమించేందుకు,కేంద్రం నుండి నిధులు సమీకరించేందుకు,రాష్ట్రంలోఈ  ప్రాంతంలో నదుల అనుసంధాన ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఎంపీగా రాయపాటి విశేషంగా కృషి చేశారు.
 
ఈ అభివృద్ధీ ఆయన్ను విజయాల బాటలో నడిచేందుకు దోహద పడుతుంది.ఇక ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో..బిజేపి నుండి కన్నా,వైసిపి నుండి లావు శ్రీకృష్ణ దేవరాయలు  పోటీలో ఉన్నా.. రాయపాటిదే గెలుపు ఖాయమంటున్నారు నియోజకవర్గ ప్రజలు. గత ఐదేళ్ళల్లో రాయపాటి  నియోజకవర్గాన్ని వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేసారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు విశ్వసిస్తున్నారు.
 
గత ఐదేళ్ళ పాలనలో రాయపాటిపై స్ధానికుల్లో ఎటువంటి అవినీతి,అసంతృప్తి లేదనేది వాస్తవం.గ్రూపులు,వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరించటం,కలుపుకుపోవటం,క్షేత్ర స్ధాయిలో తెదేపాకు బలమైన క్యాడర్ ఉండటంతో రాయపాటి విజయం సునాయాసం కానుంది.
గతంలో కంటే ఈసారి భారీ మెజార్టీ రావటం ఖాయం అని రాయపాటి వర్గీయులు బలమైన ధీమాను వ్యక్తం చేస్తున్నారు.రాయపాటికి తోడుగా ఆయన తనయుడు రంగారావు,కోడలు మమత‌,కుటుంబ సభ్యులు అన్ని నియోజకవర్గాల్లో గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు.