దళితుల సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం:రాయపాటిదళితుల సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం:రాయపాటి రంగారావు     
 
సత్తెనపల్లి,జనవారధి:రాష్ట్రంలో అగ్రవర్ణ కులాలకు ధీటుగా దళితులను ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వారి సంక్షేమానికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు పేర్కొన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి పట్టణంలోని 2 వార్డులోని  హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి దళితుల సంక్షేమం కోసం చంద్రబాబు చేసిన  కార్యక్రమాలను రంగారావు వారికి వివరించారు.
 
దళితులకు 75 యూనిట్లు కరెంటు, ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు, ఇల్లు మంజూరు చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది క్రిస్మస్ కానుకను అందజేస్తూ వారిపై ఉన్న ప్రేమానురాగాలు చాటుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం మేనిఫెస్టోలో క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేశారని తెలిపారు.
 
ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం, విదేశీ విద్యకు 25 లక్షలు,దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం చేస్తామని, పాస్టర్ లకు, క్రైస్తవ సోదరులకు ఉచిత గృహవసతి కల్పిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొనటం శుభ పరిణామమని, దీనికి కృతజ్ఞతగా క్రైస్తవ సోదర సోదరిమణులు అందరూ కలిసికట్టుగా మరోసారి చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ రాయపాటి సాంబశివరావు మరియు అసెంబ్లీ అభివృద్ధి కోడెల శివప్రసాదరావు లను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.