పాకాలపాడులో జనసైనికులపై దాడిపాకాలపాడులో జనసైనికులపై దాడి
తీవ్రంగా గాయపడ్డ ఫోటో గ్రాఫర్ కోటేశ్వరరావు 
జనసేన కార్యకర్త శ్రీనివాస్
 
సత్తెనపల్లి,జనవారధి:ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలపై దాడి జరిగింది.గ్రామంలో ప్రచారం చేయరాదంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు యర్రం వెంకటేశ్వరరెడ్డి వాహనాలను అడ్డుకున్నారు.అడ్డువచ్చిన జనసేన కార్యకర్తలపై దౌర్జన్యం చేసారు.దీనికి జనసేన కార్యకర్తలు ప్రతిఘటించడంతో స్వల్ప ఘర్షణకు దారితీసింది.ఈ ఘర్షణలో జనసేన పార్టీకి చెందిన సీనియర్  ఫోటోగ్రాఫర్ కోటేశ్వరరావు,పట్టణానికి చెందిన యువకుడు చల్ల శ్రీనివాస్ గాయపడ్డారు.వీరిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.
 
దాడులు చేస్తే సహించం:యర్రం 
జనసైనికులపై దాడులు చేస్తే సహించమని జనసేన అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. మండలంలోని పాకాలపాడు గ్రామంలో  నిర్వహిస్తున్న ప్రచారాన్ని వైసిపి పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు జనసేన ప్రచారాన్ని అడ్డుకోవటం,పార్టీ కార్యకర్తలపై దాడికి దిగటంపై అయన మండిపడ్డారు.గ్రామాల్లో జనసేనకు వచ్చే స్పందన చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని,ఇది సరైన పద్దతి కాదని హితవు పలికారు.ఈ ఎన్నికల్లో ఇలాంటి వారికీ ప్రజలు తగిన బుద్ది చెప్తారన్నారు.