మహిళా సాధికారత చంద్రబాబుతోనే సాధ్యంనరసరావుపేట,జనవారధి:రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం కృషిచేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత అన్నారు. శనివారం నాడు నరసరావుపేట పట్టణంలోని కాకతీయ నగర్, రెడ్డి నగర్ లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ఆమె ఓటర్లకు వివరించారు.

 

ఈ సందర్భంగా రాయపాటి మమత మాట్లాడుతూ.. లోటు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించగలమ అనే సందేహం నుండి నేడు అన్ని వర్గాల వారికి వివిధ రూపాల్లో లబ్ధిని చేకూర్చిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా పైకి తీసుకు వచ్చేందుకు డ్వాక్రా రుణమాఫీ నుండి పసుపు కుంకుమ వరకు పెద్ద పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే మరో పదేళ్లు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని రాయపాటి మమత పేర్కొన్నారు.

 

నరసరావుపేట పార్లమెంటు పరిధిలో నీటి ఎద్దడిని తరిమికొట్టేందుకు ఆరు వందల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు కు కృషిచేసి పల్నాడు ప్రాంత ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఎంపీ రాయపాటి ని, వైద్య సేవ ద్వారా ప్రజల మన్ననలు పొంది అరవింద బాబు లా గెలుపు కోసం సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని రాయపాటి మమత కోరారు