ఆ విషయంలో పవన్ అభిమానులకు హ్యాట్సాఫ్సత్తెనపల్లి,జనవారధి:సామాజిక మార్పుకోసం సమర శ‍ంఖాన్ని పూరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకకోసం సత్తెనపల్లి నియోజకవర్గం కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూశారు.మధ్యాహ్నం నుండి సాయత్రం వరకు ఓపిగ్గా ఎదురు చూసిన కార్యకర్తలకు పవన్ పర్యటన రద్దయిందని ఆ పార్టీ నేతలు ప్రకటించటంతో తీవ్ర నిరాశ ఎదురైంది.
 
సుమారు 5గంటల నిరీక్షణకు నాయకుల ప్రకటన నిరాశన మిగిల్చింది.ప్రతి జనసైనికుడు సహనంగా,ప్రశాంతంగా మండుటెండను సైతం లెక్కచేయకుండా జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా నిరీక్షీంచారు.మహిళలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పవర్ స్టార్ ను చూసేందుకు బారులు తీరారు.పవన్ పర్యటన రద్దైనా,నిరుత్సాహం అలుముకున్నా.. ఏమాత్రం సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వెనుదిరిగిపోవటం ప్రశంసనీయమని నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.