పాలక,ప్రతిపక్షాలపై యర్రం నిప్పులుపర్సెంటేజీలు లేకుండా పనులు చేస్తా
అంబటికి అన్ని కోట్ల సంపద ఎలా సాధ్యం
పాలక,ప్రతిపక్షాలపై యర్రం నిప్పులు
 
సత్తెనపల్లి,జనవారధి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధాకాలన్నీ బాగుంటే,రైతులందరు సంతోషంగా ఉంటే,అందరికి సమన్యాయం చేశామని మీరు నమ్ముతుంటే పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్ధులు మద్యం,డబ్బు పంపిణీ చేయకుండా నాలాగా ఎన్నికల్లో పనిచేయాలని జనసేన అభ్యర్ధి యర్రం వెంకటేశ్వరరెడ్డి సవాల్ విసిరారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చిన్న చిన్న పదవులు చేసిన అంబటి రా‍ంబాబుకు అన్ని కోట్ల రూపాయల ఆస్ధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.తాను అధికారంలోకి వస్తే పర్సెంటేజీలు లేకుండా పనులు చేస్తానని జనసేనను గెలిపించాలని యర్రం అభ్యర్ధించారు.
 
 
 
శుక్రవారం తాలుకా సెంటర్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు.తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..ప్రధాన పార్టీలు మీ ఓటుకిచ్చే రె‍ండు వేల నోటుతో సగటున రోజుకి మీకు రూపాయి కంటె ఎక్కువ రాదన్నారు.ఆయా పార్టీల నేతలు మాత్రం అక్రమంగా వేల కోట్ల రూపాయలుసంపాదిస్తారని విమర్శించారు.పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానన్నారు.శానిటేషన్ సమస్య తీవ్ర ఇబ్బందిగా ఉందని దాన్ని గాడిలో పెడతామన్నారు.టోల్ గేట్లు లేకుండానే ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జ్ లను పూర్తి చేయిస్తానన్నారు.
 
ఆ పార్టీ ఎంపి అభ్యర్ధి కమల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం రెండు వర్గాల గుప్తాధిపత్యంలో ఉన్నాయన్నారు.రాజ్యాధికారానికి దూరమైతే బలహీన వర్గాలు భవిషత్తులో అంతరించిపోతాయన్న అంబేద్కర్ పేర్కొనటాన్ని గుర్తు చేశారు.బడుగు సమాజిక వర్గాలకు రాజ్యాధికారం జనసేనతోనే సాధ్యమవుతుందన్నారు.కార్యక్రమంలో పార్లమెంట్ పరిధిలోని జనసేన అసెంబ్లీ అభ్యర్ధులు,జనసేన రాష్ట్ర,జిల్లా నాయకులు,స్ధానిక నాయకులు తాళ్ళూరి మోహన్ బాబు,చెంచిరెడ్డి,భావన్నారాయణ,సుబ్రమణ్యం, మణికంఠ,అనిల్ కుమార్,సిపిఎం గద్దె చలమయ్య,సిపిఐ నరిశేటి వేణుగోపాల్,బిఎస్పీ నేతలు,కార్యకర్తలు, తదితరులున్నారు.