గెలుపు ముంగిట కొమ్మాలపాటిగెలుపు ముంగిట కొమ్మాలపాటి
సంక్షేమ పధకాలే విజయానికి మూలం
జనాదరణతో దూసుకుపోతున్న శ్రీధర్
 
పెదకూరపాడు,జనవారధి:విజయలక్ష్మీ మరోసారి కొమ్మాలపాటిని వరించనుందా..?సంక్షేమ పధకాలే అయనకు విజయాన్ని అందిస్తున్నాయా..?సామాజిక ఫించన్ల పెంపు,పసుపు కుకుంమ ప్రోత్సాహం శ్రీధర్ ను మూడోసారి గెలిపించేందుకు దోహదపడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విమర్శకులు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పధకాలు,సంక్షేమ విధానాలు,పారదర్శకంగా అందించటంలో కొమ్మాలపాటి శ్రీధర్ పేద,బడుగు,బలహీన వర్గాలకు అండగా ఉండటంతో ఎన్నికల సమయంలో లబ్దిదారులంతా కొమ్మాలపాటి గెలుపుకు విశేషంగా కృషి చేస్తున్నారు.మేమున్నామంటూ..విజయం మీదేనంటూ వెన్నుతట్టుతున్నారు.
 
ఇటీవల గ్రామాల్లో చేసిన ప్రచారంలో అడుగడుగునా కనిపిస్తున్న జన నీరాజనం ఆయన విజయంపై ఆత్మవిశ్వాశాన్ని పెంచాయి.ప్రతిపక్ష పార్టీ నేతలు కోట్లాది రూపాయలు ఎర చూపి గ్రామ స్ధాయి తెదేపా నేతలను తమవైపు తిప్పుకుంటున్నా..పార్టీ కోసం మడపతిప్పకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతుక్తులు పన్నినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని  ఆపటం ఎవ్వరివల్లా కాదని శ్రీధర్ అనుచరవర్గం పేర్కొంటున్నారు.
 
అభివృద్ధితో హ్యాట్రిక్ ఖాయం:శ్రీధర్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు,గత ఐదేళ్ళ ప్రభుత్వ హయాంలోనూ మా అధినేత చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి చేశాను.సంక్షేమ పధకాలు పారదర్శకంగా లబ్దిదారులకు అందించాను.దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాను.అభివృద్ధిని ఆదరించి..మరోమారు అవకాశమిస్తారని భావిస్తున్నాను.అమరావతి వేగంగా అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞులైన చంద్రబాబును గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉంది.  ప్రచారంలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూస్తే హ్యాట్రిక్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.