జగన్ సిఎం కావాలని ఆరిమండ మహా యాగంగుంటూరు,జనవారధి:మే నెల చివరిలో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి పూర్ణాహుతికి తప్పకుండా వస్తారని గత 20నెలలుగా 54 మంది  వేద పండితులతో నిర్విరామంగా,నిర్విఘ్నంగా మహా రుద్రసహిత చంఢీ రాజశ్యామల యాగం చేస్తున్నారు ఆ ద‍ంపతులు.
 
రాజకీయ నేపధ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఆ ఇరువురు జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు..?గత రెండు సంవత్సరాలుగా లక్షలాది రూపాయలు వెచ్చించి హైదరాబాద్,,సత్తెనపల్లిలో ఎందుకు యాగాలు నిర్వహిస్తున్నారు..? జగన్ ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళకంత నమ్మకమేంటి..? అంటే వాళ్ళు చెప్పే సమాధానం ..మా నమ్మకం బలమైనది.మా సంకల్పం ధృడమైనది.దైవానుగ్రహం,ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవటం తధ్యమని ఘంటాపధంగా పేర్కొంటున్నారు నలంద విద్యా సంస్ధల చైర్మన్,కార్యదర్శులు ఆరిమండ వరప్రసాదరెడ్డి,విజయశారదరెడ్డిలు.
 
దైవభక్తి మెండుగా ఉన ఆ దంపతులు శివాజ్ఞ లేనిదే చీమైన పుట్టదని..దైవ సంకల్పంతోనే జగన్ పాదయాత్ర నిర్విగ్నంగా,దిగ్విజయంగా పూర్తయిందని నమ్ముతున్నామని చెప్తున్నారు.అలానే జగన్ ముఖ్యమంత్రయ్యేందుకు కూడా మానవ ప్రయత్నంతో పాటు దైవాశీస్సుల కోసం యాగం నిర్వహిస్తున్నామన్నారు.
 
పొదుపు సంఘాలపై పిహెచ్ డి
ప్రస్తుతం  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డ్వాక్రా సంఘ అధ్యక్షురాలుగా విజయశారద రెడ్డి బాద్యతలు నిర్వహిస్తున్నారు.  పొదుపు సంఘాల బలోపేతం,నిర్వహణ,వాణిజ్య మెళుకువలు తదితర అంశాలపై పిహెచ్ డి చేసి,జేఎన్ టియూ కళాశాల నుండి డాక్టరేట్ పొందారు.ఆమె ప్రతిభను గుర్తించి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాలకు సంబంధించిన రాష్ట్ర స్ధాయి బాద్యతలు అప్పగించారు.గత కొద్ది నెలలుగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్ధాయిలలో పార్టీకి అనుకూలంగా ఉన్న సంఘాలతో ప్రత్యేక,అంతర్గత సమావేశాలు,శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.జగన్ అందించిన అవకాశాన్ని సద్వినియోగ‍ం చేసుకుని ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. 
 
మొదటి నుండి జగన్ వెంటే:
వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం జరిగిన పరిణామాలు జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ ప్రకటించటం నుండి ఇప్పటివరకు ఆరిమండ వరప్రసాదరెడ్డి జగన్ వెంటే ప్రయాణించారు.కుటుంబంలో రాజకీయ నేపధ్యం లెకపోయినా,అప్పటి రాష్ట్ర పరిస్ధితుల దృష్ట్యా వైకాపా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ జగన్ వెన్నంటి నడిచారు.జగన్ ఆదేశాల మేరకు తొలిసారి ఎన్నికల్లో ఒకటి,రెండు పార్లమెంట్ స్ధానాలకు ఇంచార్జిగా వ్యవహరించారు.ప్రస్తుతం వినుకొండ శాసనసభ ఎన్నికల పరిశీలకులుగా ఆరిమండ‌ బాద్యతలు నిర్వహిస్తున్నారు.వైకాపాను బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేస్తూనే ఉన్నారు.తుఫాన్ భాదితులకు అన్ని గ్రామాల్లోనూ చేయూతనిచ్చారు.వరప్రసాదరెడ్డి,విజయశారదరెడ్డిల ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గం వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.అదే విధంగా ముగ్గులు,వాలీబాల్ పోటీలు నిర్వహించి పార్టీపై యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారు.జగన్ సిఎంకావటమే తమ అభిమతమని అదే లక్ష్యమని ఆరిమండ దంపతులు కృతనిశ్చయంతో ఉన్నారు.